ఈ పరికరం సంబంధిత భారతీయ ఎస్ఏఆర్ ప్రమాణం ప్రకారం రేడియో తరంగాల ఎక్స్పోజర్కు వర్తించే భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా రూపొందించబడింది (దీనిని చూడండి, ఆఫీస్ మెమరాండమ్ నంబర్. 18-10/2008-IP, భారత ప్రభుత్వం, కమ్యూనికేషన్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్), దీని ప్రకారం మొబైల్ పరికరం యొక్క ఎస్ఏఆర్ స్థాయిని సగటున 1 గ్రాము శరీర కణజాల ద్రవ్యరాశిపై 1.6 వాట్/కేజీకి పరిమితం చేయాలి.
ఎస్ఏఆర్ మరియు రేడియో ఫ్రీక్వెన్సీ ఎక్స్పోజర్ గురించి మరింత సమాచారం కోసం, దీనికి వెళ్లండి:
http://www.mi.com/in/rfexposure
వినియోగ సూచన:
- కాల్ చేస్తున్నప్పుడు తక్కువ-శక్తి గల బ్లూటూత్ ఎమిటర్తో ఉండే వైర్లెస్ హ్యాండ్స్ ఫ్రీ సిస్టమ్ (హెడ్ఫోన్, హెడ్సెట్) ఉపయోగించాలని సిఫార్సు చేయబడింది.
- వర్తించే భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండే నిర్దిష్ట గ్రహణ రేటు (ఎస్ఏఆర్) ఉన్న మొబైల్ పరికరాన్ని ఉపయోగించాలని సిఫార్సు చేయబడింది.
- పిల్లలు, కౌమారులు మరియు గర్భిణిల కోసం, ప్రతి కాల్ తక్కువ నిడివితో ఉండాలని లేదా బదులుగా టెక్స్ట్ సందేశాన్ని పంపాలని సిఫార్సు చేయబడింది.
- మంచి సిగ్నల్ నాణ్యత ఉన్న ప్రదేశంలో మొబైల్ పరికరాన్ని ఉపయోగించండి.
- క్రియాశీల వైద్య ఇంప్లాంట్లు ఉపయోగించే వ్యక్తులు, మొబైల్ పరికరాన్ని ఉపయోగిస్తున్నప్పుడు దానిని ఇంప్లాంట్కి కనీసం 15 సెంటీమీటర్ల దూరంలో ఉంచాలని సిఫార్సు చేయబడింది.